Film Producer Anji Reddy Murder Case Update :సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో జరిగిన సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు(Anji Reddy Murder Case)ను గోపాలపురం పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతోనే నిందితులు దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు నిర్ధారించారు. పద్మారావునగర్ వాకర్‌టౌన్ కాలనీ నివసించే సినీ నిర్మాత సి.అంజిరెడ్డి.. గతంలో తెలుగులో పలు సినిమాలు నిర్మించారు. దశాబ్దాల క్రితమే సానికంగా ఇంటిని నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.
Film Producer Anji Reddy Murder Case News :అంజిరెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం. ఒక కుమారుడు మోకిలా సమీపంలోని విల్లాలో ఉంటున్నారు. మరో కుమారుడు, కుమార్తె అమెరికాలో సిరపడ్డారు. అంజిరెడ్డి దంపతులు కూడా అమెరికాలో స్థిరపడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పద్మారావునగర్‌లోని ఇంటిని విక్రయించాలనుకున్నారు. ఇదే విషయాన్ని తనకు సినీ పరిశ్రమలో పరిచయం ఉన్న వ్యక్తులతో మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు పరిచయం ఉన్న సినీ రంగంలో రవి అనే ఫొటోగ్రాఫర్(Photographer) రెజిమెంటల్‌బజార్‌లోని డీమార్ట్ భవనం పైభాగంలో ఉన్న జీఆర్ కన్వెన్షన్(GR Convention) యజమాని రాజేశ్‌ను అంజిరెడ్డి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఇంటి విక్రయాలపై అంజిరెడ్డి, రాజేశ్ మాట్లాడుకున్నారు.
Tollywood Producer Anji Reddy Murder Case Hyderabad : ఇటీవల ఆ ఇంటిని చూసిన రాజేశ్ దాన్ని సొంతం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ విషయం బయటకు చెప్పకుండా స్థిరాస్తి వ్యాపారులతో ఇంటిని విక్రయించే ప్రయత్నం చేస్తానంటూ అంజిరెడ్డికి హామీనిచ్చాడు. ఖరీదైన ప్రాంతంలో ఇంటిని కొని, వ్యాపార సముదాయం నిర్మించాలనే ఉద్దేశంతో రాజేశ్ పథకం వేశాడు. సెప్టెంబరు 29న పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో అంజిరెడ్డికి ఫోన్ చేసి జీఆర్ కన్వెన్షన్‌కు రప్పించాడు.
Producer Anji Reddy Murder Case : నిర్మాత అంజిరెడ్డి హత్య.. ఆస్తి కోసం ప్రథకం ప్రకారం కుట్ర
Twist in Film Producer Anji Reddy Murder Case : గత నెల 29న తనకారులో అంజిరెడ్డి రెజిమెంటల్‌బజార్‌లోని జీఆర్ కన్వెన్షన్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి రాజేశ్, అంజిరెడ్డి, మరో ముగ్గురు కలసి మేడ్చల్ వైపు వెళ్లినట్టు సమాచారం. అంజిరెడ్డితో అక్కడే పత్రాలపై సంతకాలు చేయించుకోవాలని భావించారు. భౌతికదాడికి పాల్పడినా ప్రయోజనం లేకపోవటంతో.. తిరిగి ఐదుగురు కలసి జీఆర్ కన్వెన్షన్ వద్దకు వచ్చారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. అక్కడ జరిగిన గొడవలో ముగ్గురు వ్యక్తులు అంజిరెడ్డిపై దాడి చేసి హతమార్చినట్టు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని డీమార్ట్ భవనంలోని మూడో సెల్లార్‌కు తీసుకెళ్లారు. ఆయన కారుతో సెల్లార్‌లోని పిల్లర్‌ను ఢీకొట్టారు. కారు తీస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతిచెందినట్టు చిత్రీకరించారు.
Film Producer Murder in Dmart Hyderabad :అదే రోజు రాత్రి అంజిరెడ్డి కుమారుడు చరణ్‌రెడ్డికి రవి అనే వ్యక్తి ఫోన్ చేశాడు. డీమార్ట్ బేస్‌మెంట్ 3 పార్కింగ్‌లో జరిగిన ప్రమాదంలో అంజిరెడ్డి మరణించాడని సమాచారమిచ్చాడు. ఘటనాస్థలానికి చేరుకున్న చరణ్‌రెడ్డి తండ్రి అనుమానస్పద మరణంపై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి ఒంటిపై బంగారు గొలుసు, రెండు ఉంగరాలు మాయమైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. గత నెల 30న కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పథకం ప్రకామమే హత్య :డీమార్ట్, జీఆర్ కన్వెన్షన్, రెజిమెంటల్‌బజార్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా సేకరించిన వివరాలతో అంజిరెడ్డి హత్య పక్కా పథకం ప్రకారమే జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. ప్రధాననిందితుడు రాజేశ్, మరో నలుగురుని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిస్తున్నట్లు సమాచారం. హత్యకు సహకరించిన ఇద్దరు బిహారీయులు రాజేశ్ వద్ద పనిచేస్తున్నారని, ఎటువంటి సుఫారీ తీసుకోలేదని పోలీసుల దర్యాప్తులో గుర్తించినట్టు తెలుస్తోంది. కాగా.. కలకలం రేపిన సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య విషయంలో ఇవాళ పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Hyderabad Man Killed in London : లండన్‌లో హైదరాబాద్ వాసి హత్య.. కూతురు పెళ్లి కోసం భారత్‌కు వద్దామనుకునేలోగా దారుణం
Bihar Young Man Murder Case in Mahbubnagar : బురదలో తలను కాలితో తొక్కి.. చంపేసిన తర్వాత పాతిపెట్టి వరినాట్లు నాటారు