హైదరాబాద్ బాలాపూర్ లడ్డూకు ఎంత ప్రాముఖ్యత ఉందో అది గత కొన్ని దశాబ్దాలుగా పలికే ధరను చూస్తేనే తెలుస్తుంది. ఏడాదికేడాది బాలాపూర్ లడ్డూ ధర అమాంతం పెరుగతూ... అందరినీ అశ్చర్యపరుస్తుంది. అలాంటిది... ఈ సారి ఏకంగా రూ.17 లక్షల 60 వేలు పలికింది. కానీ... ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్ బస్తీ గణపతి లడ్డూ ఆ రికార్డును బద్దలు కొటింది. ఎవరూ ఊహించని విధంగా రూ.17 లక్షల 75 వేలు పలికి నగరవాసుల్ని ఆశ్చరచకితుల్ని చేసింది. ఈ ఖరీదైన లడ్డూను భాజపా నాయకుడు గోవర్ధన్ దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. గతేడాది కూడా రూ.15.1 లక్షలు పలికిన వినాయక్ నగర్ లడ్డూ... నగరంలో రెండో స్థానంలో నిలిచింది.
బాలాపూర్ లడ్డూ రికార్డు బద్దలు కొట్టిన ఫిలింనగర్ లడ్డూ...! - వినాయక్‌నగర్ బస్తీ గణపతి
గణపతి లడ్డూ అంటే గుర్తొచ్చేది బాలాపూరే. ఏటా జరిగే వేలం పాటలో దిమ్మతిరిగే ధర పలుకుతూ... వినాయకుని ప్రసాదాన్ని చాలా ఖరీదు చేస్తోంది. కానీ... బాలాపూర్ గణనాథుని లడ్డే కాదు నా లడ్డూ... చాలా కాస్ట్లీ అంటున్నాడు ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్ గణేశుడు. నగరంలో తనదే అతి ఖరీదైన లడ్డూగా రికార్డు నమోదు చేశాడు.
film-nagar-laddu-makes-history-in-bidding-by-crossing-balapoor-laddu-rate
Last Updated : Sep 12, 2019, 10:06 PM IST