నేటి యువతరం నిరాశ, నిస్పృహలకు స్వస్తి పలికి సమాజ చైతన్యం కోసం పోరాడాలని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. పెడదారి పడుతున్న సమాజానికి చేయూతనిచ్చేందుకు మంచి మనసున్న మనుషులు అవసరమని తెలిపారు. అలాంటి వారే ధన్యజీవులని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లోని తాజ్ మహల్ హోటల్లో 'అమ్మ నాన్న అనాధ ఆశ్రమం' లోగో, వెబ్ సైట్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సంస్థ ద్వారా గట్టు శంకర్ చేస్తున్న సేవలు వెలకట్టలేవని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు అచ్చిరెడ్డి, ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి, విన్ను సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబ పోషణకే నానా ఇబ్బందులు పడే ఈ రోజుల్లో నాలుగు వందల మంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించడం గొప్ప విషయమని సినీ నిర్మాత అచ్చిరెడ్డి అన్నారు.