తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50నుంచి 100శాతానికి పెంచాలని తెలుగు చలన చిత్ర మండలి కోరింది. 50శాతం సీటింగ్ సామర్థ్యంతో ఇరు ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయని... దీని వల్ల థియేటర్ల నిర్వహణకు ఎక్కువ ఖర్చు అవుతుందని పేర్కొంది. ఫలితంగా యజమానులు నష్టపోవాల్సి వస్తోందని నిర్మాతల మండలి తరఫున ఫిల్మ్ ఛాంబర్ గౌరవ కార్యదర్శులు ప్రసన్నకుమార్, వడ్లపట్ల మోహన్ అన్నారు.
నష్టాలొస్తున్నాయ్... సీటింగ్ సామర్థ్యం పెంచండి: చలన చిత్ర మండలి - తెలంగాణ వార్తలు
థియేటర్ల సామర్థ్యం పెంచాలని తెలుగు చలన చిత్ర మండలి కోరింది. 50శాతం సీట్లతో నిర్వహణ ఖర్చు పెరిగి యజమానులు నష్టపోవాల్సి వస్తోందని పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం తరహాలో వంద శాతం సీటింగ్కు అనుమతి ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేసింది.
నష్టాలొస్తున్నాయ్... సీటింగ్ సామర్థ్యం పెంచండి: చలన చిత్ర మండలి
కరోనా కేసులు రోజు రోజుకూ తగ్గుతున్న క్రమంలో తమిళనాడు ప్రభుత్వం తరహాలో వందశాతం సీటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే సినిమా థియేటర్ల నిర్వహణకు... సినీ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.
ఇదీ చదవండి:త్వరలో ప్రభాస్ 'రాధేశ్యామ్' టీజర్!