హైదరాబాద్ చిలకలగూడ పీఎస్ పరిధిలోని పద్మారావు నగర్ పెట్రోల్ బంక్ వద్ద ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. పెట్రోల్ పోయించుకునేందుకు వస్తుండగా.. వెనుక నుంచి వచ్చి ఆకస్మాత్తుగా అతను పెట్రోల్ బంక్ వైపు వెళ్లగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య గొడవ పెరిగి.. రోడ్డుపైనే కొట్టుకున్నారు.
పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు - fight by motor cyclists at secunderabad
సరైన సూచిక ఇవ్వకుండా పక్కదారిలో వెళ్లారంటూ ఇద్దరు వాహనదారులు గొడవపడిన ఘటన హైదరాబాద్ పద్మారావునగర్‌లోని పెట్రోక్బంక్ వద్ద జరిగింది. ఘటనలో గాయపడిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.
పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు
ఒకరినొకరు దూషించుకుంటుూ ఇష్టారీతిలో పిడి గుద్దుల గుప్పించారు. ఘటనలో గాయపడిన అశోక్ అనే వ్యక్తి చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవగా.. పోలీసులు దుండగుడి కోసం వెతుకుతున్నారు.
ఇవీ చూడండి:తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు