హైదరాబాద్ అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. శుక్రవారం ఒక్క రోజే 50 కేసులు నమోదయ్యాయి. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట పరిధిలోని 3డివిజన్లలో ఈ కేసులు తేలాయి. కాచిగూడలోని 69 ఏళ్ల వృద్ధురాలు కరోనా చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందింది.
శుక్రవారం అంబర్ పేట డివిజన్ పరిధి నుంచి 22, కాచిగూడ డివిజన్ పరిధిలో 16, నల్లకుంట డివిజన్ పరిధిలో 12 కేసులు నమోదయ్యాయి. అంబర్ పేట పోలీస్ క్వార్టర్స్‌లో ఉండే ముగ్గురు కానిస్టేబుల్స్‌కి వైరస్ నిర్ధరణ అయింది.