తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు స్వదేశానికి 15 మంది గల్ఫ్​ బాధితులు - స్వదేశానికి 15 మంది గల్ఫ్​ బాధితులు

రాష్ట్రంలోని గల్ఫ్​ అసోసియేషన్​తో తెలంగాణకు చెందిన 15 మంది గల్ఫ్​ బాధితులు స్వదేశానికి పయనమయ్యారు. నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం ఇరాక్​కు వెళ్లి.. ఏజెంట్​ చేతిలో మోసపోయారు.

నేడు స్వదేశానికి 15 మంది గల్ఫ్​ బాధితులు
నేడు స్వదేశానికి 15 మంది గల్ఫ్​ బాధితులు

By

Published : Feb 14, 2020, 11:23 AM IST

నేడు స్వదేశానికి 15 మంది గల్ఫ్​ బాధితులు

ఉపాధి కోసం ఇరాక్​కు వెళ్ళి ఏజెంట్ చేతిలో మోసపోయిన రాష్ట్రానికి చెందిన 15 మంది స్వదేశానికి బయల్దేరారు. నాలుగేళ్ల క్రితం అక్కడకు వెళ్లిన వారు ఏజెంట్ చేతిలో మోసపోయి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్థానిక గల్ఫ్ అసోసియేషన్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్లారు.

రాష్ట్ర ప్రభుత్వం వారిని స్వరాష్ట్రానికి రప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఇవాళ వారు స్వదేశానికి పయనమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి:ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు ఎందుకైంది.. దాని వెనకున్న కథేంటి?

ABOUT THE AUTHOR

...view details