వచ్చే ఏడాది నిర్వహించే రాములోరి కల్యాణానికి, గోటితో వలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేయాలి. వీటి తయారీ కోసం సంప్రదాయబద్ధంగా.. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో రైతులు సాగు చేస్తారు. ఆ పనులను సోమవారం ప్రారంభించారు.
భద్రాద్రి రామయ్యకు ప్రత్యేకం.. కోటి తలంబ్రాల సాగు ప్రారంభం - news on field works importance in eastgodavari
వచ్చే ఏడాది నిర్వహించే రాములోరి కల్యాణానికి వినియోగించే కోటి తలంబ్రాల సాగుకు సర్వం సిద్ధమైంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా వాసులు ఏరువాక పనులు ప్రారంభించారు. ఇలా తొమ్మిదేళ్లుగా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

సీతారాముల కోసం.. కోటి తలంబ్రాల సాగు ప్రారంభించిన రైతాంగం
రాముడు, హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు వేషధారణలతో రైతన్నలు పనులకు శ్రీకారం చుట్టారు. పొలాన్ని దున్నించి, విత్తనాలు చల్లారు. రాముడి కీర్తనలను ఆలపిస్తూ సాగు చేపట్టారు. భద్రాచలం, ఒంటిమిట్టల్లో రాములోరి కల్యాణానికి.. తొమ్మిదేళ్లుగా తలంబ్రాలను పంపిస్తున్నామని కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కె.అప్పారావు చెప్పారు.
ఇదీ చూడండి:కరోనా టెస్టులు, చికిత్సల ధరలను ప్రకటించిన ప్రభుత్వం