తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలు పెట్టుబడులు పెట్టగా... వాటి సరసన ఫియట్ క్రిస్లర్ సంస్థ కూడా చేరేందుకు సిద్ధమైంది. జీప్ బ్రాండ్ తో కార్లను తయారు చేసే ప్రముఖ వాహన సంస్థ ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్.... రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న ఫియట్ క్రిస్లర్ - Fiat Chrysler invests news
తెలంగాణలో ఫియట్ క్రిస్లర్ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. రూ.1100 కోట్లు పెట్టుబడిని ఫియట్ క్రిస్లర్ పెట్టనుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న ఫియట్ క్రిస్లర్
పదకొండు వందల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
- ఇదీ చూడండి:తెలంగాణలో ఇండోనేషియా పెట్టుబడులు