గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొన్న పోలీస్ అధికారులకు ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇచ్చింది. నయీమ్ నేర సామ్రాజ్యానికి సహకరించారని 25 మంది పోలీస్ అధికారులపై ఆరోపణలు రాగా.. ఇందుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని సిట్ పేర్కొంది. 25 మంది అధికారులపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఎలాంటి చర్యలకు సిఫార్సు చేయలేదు. సిట్‌కు సుపరిపాలన వేదిక రాసిన లేఖకు ఇచ్చిన సమాధానంలో ఈ విషయం బయటపడింది.
'నయీమ్ ఎన్కౌంటర్ కేసును సీబీఐచే విచారణ జరిపించాలి' - Padmanabha reddy on sit in nayeem case
నయీమ్‌కు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది పోలీస్ అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత 173 నేరాభియోగ పత్రాలు న్యాయస్థానంలో దాఖలు చేసినా.. ఏ ఒక్క కేసులో ఇప్పటి వరకు దర్యాప్తు పూర్తి కాలేదని ఆరోపించారు. ఈ కేసును సీబీఐచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత మొత్తం 240 కేసులు నమోదు చేశారని.. ఇప్పటి వరకు 173 నేరాభియోగ పత్రాలు న్యాయస్థానంలో దాఖలు చేసినా.. ఏ ఒక్క కేసులో ఇప్పటి వరకు దర్యాప్తు పూర్తి కాలేదని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు. నయీమ్ ఇంట్లో దొరికిన డబ్బు విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. నయీమ్ డైరీ గురించి బయటికి చెప్పకపోవడం.. దర్యాప్తుపై సందేహాలు లేవనెత్తుతోందని పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు నయీమ్ ఎన్కౌంటర్ కేసును సీబీఐచే విచారణ జరిపించాలని గవర్నర్‌కు రాసిన లేఖలో సుపరిపాలన వేదిక డిమాండ్ చేసింది.
ఇదీ చూడండి: ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరు సరిగా లేదు: పద్మనాభరెడ్డి