తెలంగాణ

telangana

ETV Bharat / state

'సహకార బ్యాంకులో అవినీతి కేసును సీఐడీకి అప్పగించాలి'

గవర్నర్ తమిళిసైకి సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. దేవరకొండ సహకార బ్యాంకులో చోటుచేసుకున్న అవినీతిని సీఐడీ వెంటనే బయటపెట్టాలని ఆయన కోరారు.

'అవినీతిని సీఐడీ వెంటనే బయటపెట్టాలి'
'అవినీతిని సీఐడీ వెంటనే బయటపెట్టాలి'

By

Published : Jan 5, 2021, 2:28 PM IST

నల్గొండ జిల్లా దేవరకొండ సహకార బ్యాంకులో చోటు చేసుకున్న అవినీతిని సీఐడీ వెంటనే బయటపెట్టాలని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలివ్వాలని ఆయన గవర్నర్​ను కోరారు. ఈ మేరకు గవర్నర్​కు లేఖ రాశారు.

2009-13 సంవత్సరాలలో దేవరకొండ సహకార బ్యాంకులో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని పద్మనాభరెడ్డి తెలిపారు. దీనిపై అప్పటి నల్గొండ జిల్లా సంయుక్త కలెక్టర్ విచారణ జరిపి రూ. 25 కోట్ల ప్రజాధనం ఇతరుల జేబుల్లోకి వెళ్లినట్లు నివేదిక ఇచ్చారని చెప్పారు. 2013 అక్టోబర్​లో సహకార బ్యాంక్​ పాలకమండలి... దేవరకొండ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారని... కేసు తీవ్రత దృష్ట్యా కేసును సీఐడీకి అప్పగించాలని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారని తెలిపారు.

ఈ మేరకు 2015లో కేసును సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని... మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఆరు సంవత్సరాలు కావొస్తున్నా... ఈ కేసులో పురోగతి లేదని... సీఐడీ దర్యాప్తు ఎందుకు ఆలస్యమవుతోందని సుపరిపాలన వేదిక అనుమానం వ్యక్తం చేసింది. సీఐడీ వెంటనే అవినీతిని బయటపెట్టి, అక్రమార్కులకు శిక్షపడేలా చేయాలని పద్మనాభరెడ్డి కోరారు.

ఇదీ చూడండి:బండి సంజయ్​కు ఘనస్వాగతం పలికిన వరంగల్ శ్రేణులు

ABOUT THE AUTHOR

...view details