ప్రైవేట్ బడులలో ఫీజుల వసూలుపై గవర్నర్ తమిళిసై కి సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. ఈ విషయంలో విజిలెన్స్ డీజీతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయని ఆరోపించారు. ఫీజుల నియంత్రణపై తిరుపతి కమిటీ ఇచ్చిన నివేదిక అటకెక్కిందని పద్మనాభ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలు... నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, బ్యాగులు, ఇతర వస్తువులను అధిక ధరకు విక్రయిస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని... ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 46ను ప్రైవేట్ పాఠశాలలు పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయ పలుకుబడితో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని తెలిపారు.
'ప్రభుత్వ ఉత్తర్వులను ప్రైవేటు బడులు బేఖాతరు చేస్తున్నాయి'
ప్రభుత్వ ఉత్తర్వులను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయని ఆరోపించారు సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి. ఈ మేరకు గవర్నర్ తమిళిసై కి ఆయన లేఖ రాశారు.
'ప్రభుత్వ ఉత్తర్వులను ప్రైవేటు బడులు బేఖాతరు చేస్తున్నాయి'