తెలంగాణ

telangana

ETV Bharat / state

'కమలా నెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో విద్యార్థినులకు అస్వస్థత' - SFI STUDENTS

కళాశాల వసతి గృహంలో కలుషిత ఆహారం తీసుకున్న పలువురు విద్యార్థునులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకుంది. బాధితులను ఆసుపత్రికి తరలించట్లేదన్న సమాచారం అందుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు.. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

108కి సమాచారం అందించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు

By

Published : Jun 24, 2019, 7:26 PM IST

హైదరాబాద్ నాంపల్లిలో కమలా నెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో కాలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించకుండా హాస్టల్​లోనే నిర్బంధించారని విద్యార్థులు వాపోయారు.
విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని 108కి సమాచారం అందించారు. అనంతరం వారికి ప్రాథమిక చికిత్సను అందించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడిన కళాశాల యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్​ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.

కలుషిత ఆహారం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినులు
ఇవీ చూడండి : 'బంగ్లాలు కట్టడం కాదు.. ప్రజల గోడు వినండి..'

ABOUT THE AUTHOR

...view details