హైదరాబాద్ నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'గుడ్ సమర్టీయన్స్' కార్యక్రమానికి సీపీ మహేశ్ భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ కాలంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న సుమారు వందమంది వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సత్కరించారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో దాతలకు సన్మానం - rachakonda Police Commissioner felicitation to donars
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాటి మనుషులకు సహాయం చేయడం చాలా అభినందనీయమని సీపీ మహేశ్ భగవత్ అన్నారు. హైదరాబాద్ నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'గుడ్ సమర్టీయన్స్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
![రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో దాతలకు సన్మానం felicitation to good Samaritans for services during covid-19 pandemic in subhuman conventional hall nagole](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7413629-thumbnail-3x2-hyd.jpg)
రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో దాతలకు సన్మానం
విపత్కర పరిస్థితుల్లో సాటి మనుషులకు సహాయం చేయడం చాలా అభినందనీయమని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను సీపీ కొనియాడారు. లాక్డౌన్ సడలించినప్పటికీ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ.... కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పేద ప్రజలకు చేయూత అందించి... సమాజానికి సేవ చేయడానికి ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర పోలీసుశాఖకు దాతలు కృతజ్ఞతలు తెలిపారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో దాతలకు సన్మానం
ఇదీ చూడండి:త్రిశూల వ్యూహంతో లాక్డౌన్ 5.0- కొత్త రూల్స్ ఇవే...
Last Updated : May 30, 2020, 11:37 PM IST