కొవిడ్‌ను జయించి మళ్లీ విధుల్లోకి చేరిన పోలీసులకు హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీకుమార్ సన్మానం చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 200 మంది పోలీసు అధికారులు కరోనా జయించారు. లాక్డౌన్లో ఫ్రంట్ రోల్ పోషించి విధి నిర్వహణలో పలువురు పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత వారు కోలుకుని తిరిగి విధుల్లో చేరినందుకు వారి సేవలను అంజనీకుమార్ సన్మానించారు.
కరోనాను జయించి విధుల్లోకి చేరిన పోలీసులకు సన్మానం - felicitation to corona cured police by cp anjani kumar
కరోనాతో పోరాడి జయించి.. మళ్లీ విధుల్లోకి చేరిన పోలీసులకు హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీకుమార్ సన్మానించారు. లాక్డౌన్లో ప్రాణాలకు తెగించి పోరాడిన పోలీసుల కృషిని సీపీ అభినందించారు.
![కరోనాను జయించి విధుల్లోకి చేరిన పోలీసులకు సన్మానం felicitation to corona cured police by cp anjani kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8391162-36-8391162-1597233430901.jpg)
కరోనాను జయించి విధుల్లోకి చేరిన పోలీసులకు సన్మానం
హైదరాబాద్ కమిషనరేట్‌లో పరిధిలో ఇప్పటివరకు రెండువేల మందికిపైగా పోలీసు అధికారులకు కరోనాతో పోరాడి జయించినట్లు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. కార్యక్రమానికి అదనపు కమిషనర్ చౌహాన్, జాయింట్ సీపీ ఎస్.బీ తరుణ్ జోషి, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కరోనాను జయించి విధుల్లోకి చేరిన పోలీసులకు సన్మానం
ఇదీ చదవండి:'కోజికోడ్ విమానాశ్రయ రన్‌వే సురక్షితమైనదే'
Last Updated : Aug 12, 2020, 8:08 PM IST