తెలంగాణ

telangana

ETV Bharat / state

FDI in Telangana 2023 : తెలంగాణకు విదేశీ పెట్టుబడుల ప్రవాహం.. ఏపీ కంటే 10 రెట్లు ఎక్కువ - Foreign Direct Investments in Telangana 2023

FDI in Telangana 2023 : రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు వెల్లువలో వస్తున్నాయి. క్యాలెండర్‌ సంవత్సంలోని తొలి నెలలలో దేశంలోనే నాలుగో స్థానంలో తెలంగాణ నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 8 వేల 655 కోట్ల ఎఫ్​డీఐలు వచ్చినట్టు వెల్లడించింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్​ మాత్రం ఈ విషయంలో చతికిల పడింది. ఏపీతో పోలిస్తే తెలంగాణకు 10 రెట్లు ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్టు డీపీఐఐటీలో తేలింది.

Foreign Investment inTelangana
Inflow of Foreign Investment to Telangana

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 9:55 AM IST

FDI in Telangana 2023 ఏపీతో పోలిస్తే తెలంగాణకు 10 రెట్లు ఎక్కువ విదేశీ పెట్టుబడులు

FDI in Telangana 2023 :రాష్ట్రానికి ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(Foreign Direct Investment) ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో దేశంలోకి మొత్తం లక్షా 66 వేల 294 కోట్ల ఎఫ్​డీఐలు వచ్చాయి. ఇందులో జనవరి నుంచి మార్చి మధ్యలో 76 వేల 361 కోట్లు, ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్యలో 89 వేల 933 కోట్లు వచ్చాయి.

Telangana has 10 Times More FDI Than AP :ఈ ఆరు నెలల కాలంలో రాష్ట్రానికి 8 వేల 655 కోట్లు రాగా, ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 744 కోట్లు దక్కినట్లు కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం(Internal Trade Department) తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం వెల్లడైంది. అంటే తెలంగాణకు ఏపీ కంటే 10 రెట్లు ఎక్కువగా వచ్చాయి. తెలంగాణకు తొలి మూడు నెలల్లో వెయ్యి 826 కోట్లు, మళ్లీ మూడు నెలల్లో 6 వేల 829 కోట్లు వచ్చాయి. అదే సమయంలో ఏపీకి తొలి మూడు నెలల్లో 297 కోట్లు, ఇంకో మూడు నెలల్లో 447 కోట్లు దక్కాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల పెట్టుబడులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది.

Telangana Govt on Non-tax income : భారీ పన్నేతర ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక

Foreign Direct Investments in Telangana 2023 :ఈ త్రైమాసికంలో మహారాష్ట్రకు 36 వేల 634 కోట్ల ఎఫ్​డీఐలు, దిల్లీకి 15 వేల 358 కోట్లు, కర్ణాటకకు 12 వేల 046 కోట్లు వచ్చాయి. తెలంగాణకు 6 వేల 829 కోట్లు, గుజరాత్‌కు 5 వేల 993 కోట్లు, తమిళనాడుకు 5 వేల 181 కోట్లు, హరియాణాకు 4 వేల 056 కోట్ల విదేశీ పెట్టుబడులు దక్కాయి. ఇందులో గుజరాత్‌ కన్నా తెలంగాణ ఒక మెట్టు పైనే నిలిచింది.

Foreign Investments in Telangana 2023 :2023 క్యాలెండర్‌ ఇయర్‌ తొలి ఆరు నెలల్లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాల్లోతెలంగాణ ఆరో స్థానంలో నిలువగా.. ఆంధ్రప్రదేశ్‌ 12వ స్థానానికి పరిమితమైంది. మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక తొలి మూడుస్థానాలను ఆక్రమించాయి. 16 రాష్ట్రాలకే ఒక్కోదానికి 100 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. కేంద్ర వాణిజ్య శాఖలోని డీపీఐఐటీ(Department for Promotion of Industry and Internal Trade) 2019 అక్టోబరు నుంచి రాష్ట్రాల వారీగా లెక్కిస్తోంది. అప్పటి నుంచి ఈ సంవత్సరం జూన్‌ వరకు ఆంధ్రప్రదేశ్‌కు 6 వేల 495 కోట్ల ఎఫ్​డీఐలు రాగా.. తెలంగాణకు 42 వేల 595 కోట్లు వచ్చాయి.

Telangana Tax Revenue Increased : 4 నెలల్లో.. రాష్ట్ర ఖజానాకు పన్నుల రూపంలో రూ. 42,712 కోట్లు

IT Refund Scam Telangana : 'తప్పుడు మార్గంలో రీఫండ్‌ పొందిన వారిపై ఐటీ చర్యలు'

ABOUT THE AUTHOR

...view details