జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం... భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించింది. జమ్మూ సమీపంలోని మజీన్ గ్రామంలో 62.06 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఆలయ నిర్మాణాన్ని తలపెట్టారు. పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య పునాది వేసి.. ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి హాజరయ్యారు.
జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ - తెలంగాణ వార్తలు
భూతలస్వర్గమైన జమ్మూ (Jammu)లో శ్రీవారు కొలువుదీరేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. తితిదే (TTD) నిర్మించతలపెట్టిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇవాళ భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జమ్మూలో శ్రీవారు కొలువుదీరేందుకు తితిదే ఏర్పాట్లు
Last Updated : Jun 13, 2021, 5:33 PM IST