తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో ధాన్యం సేకరణ విధానం భేష్​...

పెరుగుతున్న దిగుబడులకు అనుగుణంగా రైతుల నుంచి ధాన్యం సేకరించే విధానం తెలంగాణలో  బాగుందని భారత ఆహార సంస్థ అధికారులు ప్రశంసించారు. పౌర సరఫరాల కమిషనర్​ అకున్​ సబర్వాల్​తో హైదరాబాద్​ ఎర్రమంజిల్​లోని పౌర సరఫరాల భవన్​లో ఎఫ్​సీఐ అధికారులు సమావేశమయ్యారు.

ధాన్యం సేకరణ

By

Published : May 17, 2019, 8:08 PM IST

భారత ఆహార సంస్థ అధికారులతో సమావేశమైన పౌర సరఫరాల శాఖ కమిషనర్​

తెలంగాణలో ధాన్యం సేకరణ విధానం చాలా బాగుందని భారత ఆహార సంస్థ అధికారుల బృందం ప్రశంసల జల్లు కురిపించింది. హైదరాబాద్​ ఎర్రమంజిల్​లోని పౌర సరఫరాల భవన్​లో ఆ శాఖ కమిషనర్​ అకున్​ సబర్వాల్​, ఇతర అధికారులతో... ఎఫ్​సీఐ చీఫ్​ సలహాదారుడు ఎస్​పీ కార్​ నేతృత్వంలో బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఏటికేడాది పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా సర్కారు చేపట్టిన చర్యలు అభినందనీయమని తెలిపింది.

సమస్యలపై సానుకూల స్పందన

రాష్ట్ర రైస్​ మిల్లర్ల దగ్గర ఉన్న 3.44 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ధాన్య సేకరణ, నిల్వ సామర్థ్యం, ఇతర రాష్ట్రాలకు రవాణా తదితర అంశాల్లో ఎఫ్‌సీఐ నుంచి ప్రభుత్వానికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలన్న అకున్‌ సబర్వాల్‌ విజ్ఞప్తులపై ఎస్​పీ కార్​ సానుకూలంగా స్పందించారు.

ఇదీ చూడండి : అమ్మో కూర'గాయం'... వాటి కంటే పచ్చళ్లు నయం

ABOUT THE AUTHOR

...view details