Father YouTube Treatment to Daughter: సాధారణంగా ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోతే ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటారు. ప్రస్తుతం కొంత మంది తెలివిగా ఆలోచించి ఆస్పత్రికి వెళ్లకుండానే.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆన్లైన్లో చూసి సొంత వైద్యం చేసుకుంటున్నారు. దీని వల్ల అప్పటికి ఆరోగ్యం కుదుటపడినా.. భవిష్యత్తులో ప్రమాదాన్ని తెస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఓ వ్యక్తి తన కుమార్తెకు ఆరోగ్యం బాలేని ప్రతిసారి యూట్యూబ్, గూగుల్‌లో చూసి యాంటిబయాటిక్స్ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే.. చివరికి ఆమె ఆరోగ్యం విషమించి.. ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
కండరాలు పట్టేస్తున్నాయా? ఎక్కువ దూరం నడవలేకపోతున్నారా? ఈ ఫుడ్స్‌తో రిలీఫ్!
Own Treatment Risk For Health : ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ)లోని కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ రాఘవేంద్ర కులకర్ణి తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యనగరానికి చెందిన ఓ యువతి ఆర్కిటెక్టుగా ఉద్యోగం చేస్తోంది. ఆమెకు పలుమార్లు జ్వరం, మూత్రంలో మంట రావడంతో ఇటీవల ఏఐఎన్‌యూలో చేర్చారు. దీంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. తన మూత్రపిండాల్లో10-13 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న రాళ్లను గుర్తించారు.
Gall Bladder Stone Surgery : వృద్ధుడి పిత్తాశయంలో 1,364 రాళ్లు.. 45 గంటల పాటు శ్రమించిన వైద్యులు.. చివరకు..
Father Treatment Danger to his Daughter: ఆమెకు మూత్రపిండాల్లో రాళ్లు ఎలా వచ్చాయని తండ్రిని ప్రశ్నించినప్పుడు అసలు విషయం తెలిసింది. ఆమెకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు గూగుల్‌లో వెతికి యాంటీ బయాటిక్స్ తెచ్చి ఇచ్చేవారని, అవి కూడా సగం కోర్సు వాడేసి వదిలేసేవారని డాక్టర్ రాఘవేంద్ర చెప్పారు. అనారోగ్యం వచ్చినప్పుడల్లా ఇలా చేయడంతో శరీరంలో యాంటీ బయాటిక్స్ నిరోధకత పెరిగి(Antibiotic Resistance increased).. మందులకు లొంగని బ్యాక్టీరియా ఏర్పడిందని తెలిపారు. అతిగా యాంటీ బయాటిక్స్ వాడడం వల్ల ప్రొటీన్లు గట్టిపడి అవి మూత్రపిండాల్లో రాళ్లుగా మారాయని.. అది యూరిన్ ఇన్‌ఫెక్షన్‌కు దారితీసిందని వివరించారు.
Doctor Suggestions for Own Treatment: ఆమెకు శస్త్రచికిత్స చేసి మూత్రపిండంలోని రాళ్లను తొలగించారు. అనంతరం ఆమె కోలుకున్నాక డిశ్చార్జి చేశామని డాక్టర్ రాఘవేంద్ర తెలిపారు.వైద్యుల సూచనలులేకుండా ప్రతి చిన్న రోగానికి యాంటీ బయాటిక్స్ మందులు(Antibiotic Medicine) వినియోగించడం ప్రమాదకరమని సూచించారు. ఏదైనా రోగానికి సరైన కోర్సు వాడాలని.. ఇలా చేస్తున్న క్రమంలో సగంలో నిలిపివేయరాదని పేర్కొన్నారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి మరింత హానికరమని .. మందులకు లొంగని బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.
Type 2 Diabetes : టైప్-2 డయాబెటిస్ అంటే ఏమిటి?.. దీనిని నియంత్రించడం సాధ్యమేనా?
Stomach Pain After Eating : తిన్న వెంటనే కడుపులో నొప్పిగా ఉందా? అల్సర్ కారణమా? తగ్గాలంటే ఏం చేయాలి?