Father who killed his daughter in Visakhapatnam: కన్నతండ్రే కూతురిని హతమార్చిన ఘటన ఏపీలోని విశాఖపట్టణం నగరంలోని రెల్లివీధిలో జరిగింది. హత్య చేసిన అనంతరం సెల్ఫీ వీడియో తీసి తన కూతురిని తానే చంపేశానని చెబుతూ సామాజిక మధ్యమాలలో తన తండ్రి వడ్డాది ప్రసాద్ పోస్ట్ చేశాడు. నగరంలోని రెల్లివీధిలో నివాసం ఉంటున్న వడ్డాది ప్రసాద్ (42)ని భార్య హేమలత 13 సంవత్సరాల క్రితం వదిలేసి వేరుగా ఉంటోంది. ఆ 13 సంవత్సరాల నుంచి వీరి ఇద్దరు ఆడపిల్లల్ని ప్రసాద్‌నే పెంచాడు.
కూతుర్ని చంపి.. సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన తండ్రి.. అసలేం జరిగింది? - killed his daughter a selfie video on social media
Father who killed his daughter in Visakhapatnam: పెద్ద కూతురు ప్రేమ వివాహం చేసుకొని వెళ్లిపోయింది. చిన్న కూతురు కూడా అదే విధంగా వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆమెను ఇంటికి పిలిపించి హత్య చేశాడు. ఈ ఘటన విశాఖ నగరంలోని రెల్లి వీధిలో జరిగింది. కూతుర్ని తానే చంపిన తండ్రి ఆ తర్వాత సెల్ఫీ వీడియోను పోస్టు చేయడం కలకలం రేపింది. ఆ సెల్ఫీ వీడియోను తండ్రి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. కూతురిని చంపిన తర్వాత తండ్రి ప్రసాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
పెద్ద కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని వేరే వ్యక్తితో వెళ్లిపోగా.. రెండు రోజులు క్రితం చిన్న కూతురు కూడా స్థానికంగా ఉండే ఓ యువకుడితో వెళ్లిపోయినట్లు సమాచారం అందుకున్నాడు. నిన్న వన్ టౌన్ స్టేషన్లో ఇరువురిని పిలిచి కౌన్సెలింగ్ చేసినప్పటికీ తన కూతురు మనసు మారలేదని.. కూతురు ప్రేమించిన వ్యక్తిపై కేసులు కూడా ఉన్నాయని తండ్రి నచ్చజెప్పినప్పటికి వినలేదని తెలిసింది. ఇవాళ ప్రసాద్ తల్లి చనిపోయిన రోజు కావడంతో కూతుర్ని ఇంటికి పిలిచి హత్య చేసినట్లు ప్రసాద్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. అనంతరం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: