లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఓ తండ్రి కుమారుడి మృతదేహాన్ని చేతులపై శ్మశాన వాటికకు తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. కదిరికి చెందిన మనోహర్, రమణమ్మలు గోరంట్లలోని మాధవరాయ ఆలయం వెనుక ప్రాంతంలో నివసిస్తున్నారు. రోజంతా చెత్త నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి విక్రయిస్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది.
మనోహర్ పెద్ద కుమారుడు దేవా (11) గత శనివారం తీవ్ర అనారోగ్యానికి గురవటంతో తొలుత ప్రైవేటు వైద్యుడి వద్ద చికిత్స చేయించారు. మందులు కొనలేక.. ఆదివారం గోరంట్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హిందూపురం పంపించారు. అక్కడ మూడు రోజులు చికిత్స చేసి బుధవారం బెంగళూరు లేదా అనంతపురం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.