తెలంగాణ

telangana

ETV Bharat / state

దారుణం..! కన్న కూతురిపై తండ్రి అత్యాచారం - father raper her daughter in west godavari district

కంటికి రెప్పలా కాపాడాల్సిన కుమార్తెపై ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వికృత చేష్టలు తట్టుకోలేక బాలిక ఇంటి నుంచి పారిపోయింది. అక్కడ మరో వ్యక్తి తాను పోలీసునంటూ పరిచయం చేసుకుని బాలికను తీసుకెళ్లి ఓ గదిలో ఉంచి అత్యాచారానికి యత్నించాడు. అనంతరం ద్విచక్రవాహనంపై బాలికను తీసుకెళ్లి ఆమెను సొంత ఊర్లో దించాడు. జరిగిన విషయాన్ని ఆమె తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

father-raped-her-daughter-and-when-the-incident-broke-out-in-society-he-attempts-suicide
దారుణం..! కన్న కూతురిపై తండ్రి అత్యాచారం..

By

Published : May 22, 2020, 2:13 PM IST

ఆంధ్రప్రదేశ్​ పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలానికి చెందిన బాలిక(14)పై కన్నతండ్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. చివరకు తండ్రి వికృత చేష్టలు భరించలేక ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వచ్చి ఏలూరు వైపు వస్తుండగా ఓ అపరిచిత వ్యక్తి తనని తాను పోలీసుగా పరిచయం చేసుకున్నాడు. న్యాయం చేస్తానని మాయమాటలు ఏలూరుకు తీసుకెళ్లాడు. ఓ గదిలో ఉంచి మరుసటి రోజు తల్లిదండ్రులకు అప్పగించాడు. తల్లి ఆరా తీయడంతో జరిగిందంతా చెప్పింది. తనను గదిలో ఉంచిన వ్యక్తి కూడా బలత్కారం చేయబోయాడని బాలిక పోలీసులకు తెలిపింది. బాలిక తల్లి గురువారం ఏలూరులోని దిశ పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేయగా డీఎస్పీ పైడేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కీచక తండ్రి

పోలీసుస్టేషన్​లో తనపై కేసు నమోదైందని తెలుసుకున్న బాలిక తండ్రి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు అతన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అపరిచిత వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి : దారుణం... బాలికపై పదిహేను రోజుల నుంచి అత్యాచారం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details