కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాలనాగులా మారాడు. అభం శుభం తెలియని కన్న బిడ్డపై కన్నేశాడు. రోజుల తరబడి తండ్రి అనే ముసుగులో కామాంధుడు అరాచకం చేస్తున్నాడు. ఎవరికీ చెప్పుకోలేక చిన్నారి తన బాధను పంటి బిగువున భరించింది. తండ్రి మారతాడు అనుకుంది. కానీ ఆ కర్కశుడిలో మార్పురాలేదు.
సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన బాలికపై మళ్లీ అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. వెదురుకుప్పంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కూలీ పనులు చేస్తుంటాడు. అతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఇద్దరు కొడుకులు, రెండో భార్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలు బయట వసతి గృహాల్లో చదువుకుంటున్నందు వల్ల తల్లులు బయట ప్రాంతాల్లో పనులకు వెళ్తున్నారు.