Mokshaja murder case at Chandanagar :భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలు.. సొంత కుమార్తెను హత్య చేసే వరకు తీసుకొచ్చాయి. భార్యపై కోపంతో తన సొంత కుమార్తెను గొంతు కోసి చంపాడు ఓ తండ్రి.. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు పెద్ద వ్యూహమే రచించాడు. అందుకు ఆయన కారును ఎంచుకున్నాడు. చిన్నారి మృతదేహాన్ని వెనుక సీటులో పెట్టుకొని తాను డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు. ఇంతలో కారు ప్రమాదానికి గురి కాగా.. ఆయన అసలు బాగోతం బయటపడింది. హైదరాబాద్‌లోని చందానగర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చంద్రశేఖర్‌కు హిమాతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగిని (Software Job) కావడంతో ఆర్థికంగా కొన్ని రోజులు బాగానే గడిచాయి. ఇంతలో వారి ప్రేమకు గుర్తుగా ఓ కుమార్తె కూడా జన్మించింది. చక్కని ఉద్యోగాలు, మంచి జీవితం.. ఓ చిన్నారి.. ఇలా జీవితం సాఫీగా వెళ్తున్న తరుణంలో ఏడాది క్రితం చంద్రశేఖర్ ఉద్యోగం కోల్పోయాడు. దీంతో చంద్రశేఖర్ ఆత్మన్యూనతకు గురయ్యాడు. తరచూ భార్యతో గొడవలు పెట్టుకునేవాడు. ఇది నచ్చని హిమ.. చిన్నారి మోక్షజ(8)తో కలిసి తన సొంతింటికి వెళ్లిపోయింది.
Father killed daughter at Hyderabad :సుమారుగాఏనిమిది నెలలుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఇది నచ్చని చంద్రశేఖర్.. ఎలాగైనా భార్యకు ఆనందాన్ని దూరం చేయాలనుకున్నాడు. తన భార్యకు ఎంతో ఇష్టమైన తన సొంత కుమార్తెను అని కూడా చూడకుండా.. మోక్షజను బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు పథకం రచించాడు. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పెద్దఅంబర్‌పేట్ ఓఆర్ఆర్ (ORR) వద్ద మృతదేహాన్ని పడేసేందుకు యత్నించాడు.
ఈ క్రమంలో కారు నడుపుతూ వస్తుండగా.. అతని కారు డివైడర్‌ను ఢీకొంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. కారు వెనుక భాగంలో చిన్నారి మృతదేహాన్ని చూశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా... అసలు విషయం బయటకు వచ్చింది. చిన్నారిని తానే చంపినట్లు తండ్రి చంద్రశేఖర్ అంగీకరించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.