తెలంగాణ

telangana

By

Published : Feb 25, 2023, 2:52 PM IST

ETV Bharat / state

ఏపీలో పరువు హత్య.. కుమార్తె కాపురానికి వెళ్లలేదని చంపేసిన తండ్రి

కుమార్తె కాపురానికి వెళ్లడంలేదని కన్నతండ్రే హతమార్చాడు. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి తాతయ్య ఇచ్చిన ఫిర్యాదుతో అసలు నిజం.. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

murder
హత్య

Father Who Killed His Daughter: ప్రసన్న పాపం తల్లిలేని పిల్ల. ఆమె తల్లి చనిపోయి ఐదు సంవత్సరాలు అయ్యింది. దీంతో తన తండ్రి దేవేందర్​రెడ్డి రెండో వివాహం చేసుకున్నాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. ప్రసన్నకు వివాహం కాకముందే వేరే వ్యక్తితో ప్రేమలో ఉండేది. తనకు ఇష్టం లేకపోయిన తండ్రి చెప్పిన వ్యక్తిని చేసుకుంది. అయినా ప్రేమించిన వ్యక్తిని వదిలి ఉండలేక తన భర్తను వదిలేసి.. ప్రేమించిన వ్యక్తి దగ్గరకు వచ్చేసింది. అయితే పుట్టింటి నుంచి భర్త వద్దకు వెళ్లలేదని.. ఆమె మీద కోపంతో గొంతు నులుపి చంపేశాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఆలమూరు గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని కనిపెట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా ఆలమూరు గ్రామానికి చెందిన దేవేందర్​రెడ్డికి ఇద్దరు కుమార్తెలు ప్రసన్న, ప్రవళిక కలరు. దేవేందర్​రెడ్డికి ఐదు సంవత్సరాల క్రితం భార్య చనిపోవడంతో.. రెండో పెళ్లి చేసుకున్నాడు. కుమార్తెకు వివాహం చేయాలనే నిశ్చయించుకున్నాడు. ప్రసన్నకు రెండేళ్ల క్రితమే బనగానపల్లె మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగితో వివాహం జరిపించారు. వారు హైదరాబాద్​లో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం భర్త దగ్గర నుంచి విడిపోయి ప్రేమించిన వ్యక్తి దగ్గరకు వెళ్లిపోయింది. గ్రామస్థులు పోలీస్​స్టేషన్​లో పంచాయతీ చేసి వారి ఇద్దరినీ విడదీశారు.

కిరాతకంగా చంపిన తండ్రి: కుమార్తెను భర్త దగ్గరకు వెళ్లాలని తండ్రి ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోలేదు. ఈ నెల 10వతేదీన ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రసన్న గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత మరికొంత మంది వ్యక్తులతో కలిసి కారులో నంద్యాల నుంచి గిద్దలూరుకి వెళ్లే అటవీ ప్రాంతంలో.. తలను మొండాన్ని వేరు చేసి వేరువేరుగా లోయల్లో పడేశారు. తర్వాత ఏమి తెలియనట్లు కాలం గడిపాడు. ఆమె తాతయ్య తనకు ఫోన్​ చేయడంతో ఫోన్​ స్విచ్​ ఆఫ్​ కావడంతో తన కుమారుడైన దేవేందర్​రెడ్డిని ప్రశ్నించాడు.

తాతయ్య ద్వారా అసలు విషయం వెలుగులోకి: ప్రసన్న తాతయ్య దేవేందర్​రెడ్డిని నిలదీయడంతో తనే చంపానని ఒప్పుకున్నాడు. వెంటనే పాణ్యం పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ప్రసన్న తండ్రిని అదుపులోకి తీసుకొని.. మృతదేహం గురించి వెతికారు. రెండు రోజులు లోయలో గాలించగా కుళ్లిన మృతదేహం లభ్యమయ్యింది. శవపరీక్షల నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవేందర్​రెడ్డితో పాటు మరికొంత మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆమె తాతయ్య ఫిర్యాదుతో మొత్తం విషయం బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details