తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాన్నే నా ఆత్మవిశ్వాసం, ఆయన విలువలే ఆదర్శం'

ఊహ తెలిసినప్పట్నుంచీ ప్రతి కుమార్తె నాన్న వైపే అడుగులు వేస్తుంది. ఇందుకు తానేం భిన్నం కాదు. కొన్నాళ్ల క్రితం, తన తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో సమాచారశాఖ డైరెక్టర్‌గా పనిచేసిన సీవీ నరసింహారెడ్డితో కలిసి ఓ కార్యక్రమ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా తమ స్వగ్రామానికి వెళ్లినప్పుడు కుటుంబీకులే కాదు ఊరంతా ఆయన్ని అభినందించింది. లెక్కలేనన్ని ఇతర సందర్భాల్లోనూ కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు, అపరిచితులకూ లేదనకుండా సహాయం చేసేవారాయన. ఫలితంగా అందరి అభిమానాన్ని చురగొనేవారని ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకున్నారు రామాదేవి.

'తండ్రే నా ఆత్మవిశ్వాసం, ఆయన విలువలే నాకు ఆదర్శం'
'తండ్రే నా ఆత్మవిశ్వాసం, ఆయన విలువలే నాకు ఆదర్శం'

By

Published : Jun 20, 2020, 8:03 PM IST

ఉమ్మడి రాష్ట్రంలో సమాచారశాఖ డైరెక్టర్​గా పనిచేసిన సీవీ నరసింహారెడ్డి కొన్ని నెలల క్రితమే అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తన తండ్రి నరసింహారెడ్డి నిర్విరామంగా కృషి చేశారని కుమార్తె రమాదేవి గుర్తు చేసుకున్నారు. తనకు నాన్నే రోల్ మోడల్‌గా నిలిచారని ఫాదర్స్ డే సందర్భంగా తెలిపారు. ఉదారతత్వం, క్రమశిక్షణ, సమయస్ఫూర్తి గల వ్యక్తి నరసింహారెడ్డి అని.. ఆయన కలిసిన వారందరి హృదయాల్లోనూ చెరగని ముద్ర వేశారన్నారు. తన తండ్రి రెండు నెలల క్రితం కన్నుమూసినప్పటికీ, ఆయన నేర్పించిన జీవితతత్వం, బోధించిన పాఠాలు ఇప్పటికీ తనకి స్ఫూర్తినిస్తాయని రమాదేవి అన్నారు.

తండ్రి జ్ఞాపకాలతోనే...

భౌతికంగా తండ్రి దూరమైనా.. నిరంతరం ఆయన స్మృతులతోనే ముందుకు సాగుతున్నానని అన్నారు. ఉదయాన్నే నేను వార్త పత్రిక చదివితే... నాన్న ఒక పత్రిక అబ్బాయికి ఎలా సహాయం చేశాడో గుర్తుకొచ్చింది. తన వ్యాసాలు , అనుభవం నుంచి పాఠకులు ప్రయోజనం పొందేలా.. ఎల్లప్పుడూ కథనాలను ఎలా సమకూర్చుకుంటారో ఇప్పటికీ తనకు గుర్తుకువస్తుందన్నారు. విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం జ్ఞానాన్ని సంపాదిస్తూ ప్రజా సంబంధాలపై పుస్తకాలు రాయడం ద్వారా ప్రజలకు చేరువయ్యారని పేర్కొన్నారు. తండ్రి చేసిన కృషి ఫలితమే ఆయనను ప్రజా సంబంధాల భీష్మ పితామహగా నెలబెట్టిందని ఆమె చెప్పుకొచ్చారు.

తల్లిదండ్రుల చిత్రపటాల ముందు...

ప్రతి రోజు ఉదయం తండ్రి నరసింహారెడ్డి తన తల్లిదండ్రుల చిత్రపటాల ముందు పుష్పాలు ఉంచి భక్తితో పూజించడం, అనంతరం వారికి నివాళులు అర్పించడం తాను చూస్తూ పెరిగానని తెలిపారు. ఇప్పుడు తానూ...తన తండ్రి నరసింహారెడ్డి ఫోటో ముందు పువ్వులు ఉంచుతానని... తండ్రిని పూజించినప్పుడు తనకు శక్తి, సానుకూల ఆలోచనలు కలుగుతాయని స్పష్టం చేశారు. నేటికీ నా కుటుంబానికి జనం నుంచి ఆశీర్వాదం అందుతోందన్నారు. తాను ప్రేమగా నాన్న అని పిలిచే నరసింహారెడ్డి తనకు గురువు, శ్రేయోభిలాషి, స్నేహితుడు, ఆత్మవిశ్వాసం అని కీర్తించారు. వెలకట్టలేని సుగుణాలు, ఉన్నత విలువలను తండ్రి తమకు బహుమతిగా ఇచ్చారన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా, తండ్రులు పిల్లలకు ప్రసాదించే ఉత్తమ నడవడికను స్వీకరించి నిత్య జీవితంలో ఆచరించాలని రమాదేవి సూచించారు.

ప్రియమైన నాన్న మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాపై కురిపించినందుకు మీకు నా హృదయపూర్వకమైన ప్రాణామాలు.

సీవీ రమాదేవి

సీవీ నరసింహా రెడ్డి కుమార్తె

ఇవీ చూడండి : కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103

ABOUT THE AUTHOR

...view details