హైదరాబాద్‌లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రాజేశ్(60) అనే వ్యక్తి తన భార్య చనిపోవడంతో మరో మహిళను వివాహం చేసుకున్నాడు. రెండో భార్య, ఆమె కుమార్తె(20) నాచారం పరిధిలో నివాసముంటున్నారు.
పని నిమిత్తం యువతి... తన సవతి తండ్రి ల్యాప్‌టాప్‌ను తీసుకుంది. దానిని ఆన్ చేయగానే యువతికి ఆమె నగ్నంగా ఉన్న ఫొటోలు దర్శనమిచ్చాయి. వాటిని చూసిన కుమార్తె కుంగిపోయింది. మంచిగా కనిపించే తన సవతి తండ్రి... ఇంతంటి నీచమైన పని చేస్తాడని ఊహించలేకపోయింది. తల్లికి చెప్పలేక తనలో తానే క్షోభను అనుభవించింది.