తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్యపై కోపం... పిల్లలపై ప్రతీకారం - godavari harrasement news

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ తండ్రి తన ఇద్దరు కూమార్తెలను చిత్రహింసకు గురిచేస్తున్న వీడియోలు వెలుగుచేశాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

భార్యపై కోపం... పిల్లలపై ప్రతీకారం

By

Published : Nov 12, 2019, 3:01 PM IST

భార్య తనను వదిలి గల్ఫ్​ దేశాలకు వెళ్లిందన్న అక్కసుతో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఓ వ్యక్తి తన కుమార్తెల పట్ల దారుణంగా ప్రవర్తించాడు. వారిని చిత్ర హింసలకు గురి చేశాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమంలో వెలుగు చూడడం వల్ల నిందితుడు పరారయ్యాడు.

ఇదీ జరిగింది...

నర్సాపురం మండలం సారవ గ్రామంలో ఉల్లంపర్తి ఎలిషా, మహాలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. జీవనోపాధి కోసం ఇటీవల పిల్లలు, భర్తను వదిలి తల్లి మహాలక్ష్మి గల్ఫ్​కు వెళ్లింది. భార్య వెళ్లిపోయిందని కోపం పెంచుకున్న ఎలీషా... తన ఇద్దరు కుమార్తెలను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమంలో వెలుగు చూశాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీడియోల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

భార్యపై కోపం... పిల్లలపై ప్రతీకారం

ఇవీ చదవండి:

అత్తింటి వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details