ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికార పార్టీ విఫలమైందని హైదరాబాద్ ఫతేనగర్ 118 డివిజన్ భాజపా అభ్యర్థి ముద్దాపురం కృష్ణ గౌడ్ ఆరోపించారు. తాను కార్పొరేటర్‌గా గతంలో చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప... తెరాస కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి లేదని విమర్శించారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన దుయ్యబట్టారు.
ఆదర్శ డివిజన్‌గా తీర్చి దిద్దుతా: ముద్దాపురం కృష్ణ గౌడ్ - జీహెచ్ఎంసీ ఎన్నికలు తాజా సమాచారం
స్థానిక సమస్యలను పరిష్కరించడంలో తెరాస కార్పొరేటర్లు విఫలమయ్యారని ఫతేనగర్ డివిజన్ భాజపా అభ్యర్థి ముద్దాపురం కృష్ణ గౌడ్ ఆరోపించారు. తనకు మరో అవకాశం ఇస్తే డివిజన్‌ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
ఆదర్శ డివిజన్‌గా తీర్చి దిద్దుతా: ముద్దాపురం కృష్ణ గౌడ్
తనకు మరోసారి అవకాశం ఇస్తే ఫతేనగర్ని ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని హామీనిచ్చారు. సమస్యలు పరిష్కరించడంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసానిచ్చారు. ప్రజా సమస్యలే తన ఎజెండా అని వ్యాఖ్యానించారు. ఈ గ్రేటర్ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:మేయర్ చేసిన అభివృద్ధి శూన్యం: కాసుల సురేందర్ గౌడ్