తెలంగాణ

telangana

ETV Bharat / state

విశ్వనగరంగా ఎదిగేందుకు వసతుల వైపు వడివడిగా! - విశ్వనగరంగా ఎదిగేందుకు వసతుల వైపు వడివడిగా!

భాగ్యనగరంలో మౌలిక వసతుల కల్పనకు మరిన్ని ప్రణాళికలు రూపొందాయి. ఇప్పటివరకు ప్రతిపాదనలో ఉన్న పలు అంశాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రణాళికలో ప్రభుత్వం చేర్చింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం విడుదల చేసిన 2020 వార్షిక ప్రగతి నివేదికలో 2020-21 కార్యాచరణ ప్రణాళికలను వెల్లడించారు.

faster works development works in hyderabd coming year
విశ్వనగరంగా ఎదిగేందుకు వసతుల వైపు వడివడిగా!

By

Published : Jun 25, 2020, 7:08 AM IST

హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రహదారుల అభివృద్ధి మొదలు పట్టణారోగ్యం, పచ్చదనం పెంపు, మెట్రోరైలు రెండోదశ, ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిస్ట్‌ సిస్టమ్‌(ఇ-బీఆర్‌టీఎస్‌) వరకు ఇందులో ఉన్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం విడుదల చేసిన 2020 వార్షిక ప్రగతి నివేదికలో హైదరాబాద్‌ గత ఐదేళ్ల పురోగతి, 2020-21 కార్యాచరణ ప్రణాళికలను వెల్లడించారు.

19కి.మీ ఎలివేటెడ్‌ బీఆర్‌టీఎస్‌

కేపీహెచ్‌బీ మెట్రోరైలు స్టేషన్‌ నుంచి ఫోరం మాల్‌ మీదుగా ఐటీ కారిడార్‌ను చుడుతూ.. గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్, ఓఆర్‌ఆర్‌ వరకు ఎలివేటెడ్‌ బీఆర్‌టీఎస్‌ ప్రాజెక్ట్‌ను 2020-21 కార్యాచరణ ప్రణాళికలో ప్రభుత్వం చేర్చింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్నారు. ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధమైంది.

ఎల్‌ఆర్‌టీఎస్‌ కూడా..

  • ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ నుంచి కోకాపేట వరకు లైట్‌ రైట్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌(ఎల్‌ఆర్‌టీఎస్‌)ను 2020-21 ప్రణాళికలో చేర్చారు.
  • మూడు కారిడార్లలో ట్రామ్‌వే/రోప్‌వే ప్రతిపాదనలు ఉన్నాయి.

నిర్మాణాల్లో దూకుడు..

  • హైదరాబాద్‌.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లలో ఒకటి. గత ఐదేళ్లలో ఐటీ, వేర్వేరు సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చాయి.
  • 2015 నుంచి హైదరాబాద్‌లో 12.95 కోట్ల చదరపు అడుగుల వాణిజ్య నిర్మాణాలు కొత్తగా వచ్చాయి.
  • 2015 నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో భవన నిర్మాణాల అనుమతుల రూపంలో రూ.3507.5 కోట్ల ఆదాయం వచ్చింది. హెచ్‌ఎండీఏ పరిధిలో నిర్మాణ అనుమతుల రెవెన్యూ రూ.2000 కోట్లుగా ఉంది. మొత్తంగా ఐదేళ్లలో రూ.5507.5 కోట్ల ఆదాయం వచ్చింది.
  • 2015 నుంచి గృహ నిర్మాణాల పరంగా చూస్తే 39.21 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు వెలిశాయి.

పాదచారుల వంతెనలు..

  • హెచ్‌ఎండీఏ నగరంలో పాదచారుల వంతెనలు(ఎఫ్‌వోబీ) నిర్మిస్తోంది. వనస్థలిపురం, నెక్లెస్‌రోడ్, ఏఎస్‌రావునగర్, ఐడీపీఎల్‌లో నిర్మాణంలో ఉన్నాయి. ఉప్పల్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.
  • పాదచారుల నడకకు ఆటంకం లేకుండా 8చోట్ల స్కైవాక్స్‌ను హెచ్‌ఎండీఏ ప్రతిపాదించింది. ఇందులో ఉప్పల్, మెహిదీపట్నంలో ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌లుగా అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతం డిజైన్ల దశలో ఉన్నాయి.

మెట్రో తొలిదశ వ్యయం రూ.21,919 కోట్లు

  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం, నిర్మాణ సంస్థ కలిసి రూ.21,919 కోట్లు వ్యయం చేశాయి.
  • 2010-14 వరకు రూ.8683 కోట్లు ఖర్చు చేయగా.. 2015-20 వరకు రూ.13,236 కోట్లు వ్యయం అయ్యింది.
  • రెండోదశ విస్తరణ (2020-21 ప్రణాళిక) మెట్రోరైలు విస్తరణ సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌) సిద్ధమై ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రెండు కొత్త కారిడార్లలో విస్తరణను ప్రదిపాదించారు.
  • బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు వయా కొండాపూర్‌ 26 కి.మీ. (కారిడార్‌-1 మియాపూర్‌ స్టేషన్‌ను కలుపుతూ)
  • విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కి.మీ.
  • కారిడార్‌-3లో మిగిలిన దూరం నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు 5 కి.మీ.

ABOUT THE AUTHOR

...view details