రీజినల్ రింగ్ రోడ్‌ను రెండు భాగాలుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో ఒకటి ఉత్తర భాగం, రెండోది దక్షిణ భాగం. మొదటి భాగం అర్ధచంద్రాకారం, రెండో భాగం మరో అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఈ రెండు కలిపితే రింగ్ మాదిరిగా కన్పిస్తుంది. ఈ రెండు నిర్మాణాలు కలిపితే చూసేందుకు సర్కిల్‌గా కన్పిస్తుంది. అందుకే దీన్ని రీజనల్ రింగ్ రోడ్‌గా పిలుస్తున్నారు.
మొదటి భాగంలో 158.40 కిలోమీటర్లు, మిగిలిన భాగంలో 181.60 కిలోమీటర్లలో నిర్మాణం చేయనున్నారు. మొత్తం కలిపి 340 కిలోమీటర్ల పరిధిలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తరం వైపు సంగారెడ్డి- నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, జగ్దేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ నుంచి వచ్చే రహదారికి కలిపే విధంగా సుమారు 160 కిలోమీటర్ల జాతీయ రహదారి-ఎన్‌హెచ్ 161ఏఏ, దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి ఆమన్‌గల్, షాద్‌నగర్ మీదుగా సంగారెడ్డికి వరకు సుమారు 180 కిలోమీటర్ల రహదారి దీన్ని ఇంకా జాతీయ రహదారిగా ప్రకటించలేదు.
చిన్న మార్పులు...
సంగారెడ్డి నుంచి మొదలైన రీజినల్ రింగ్ రోడ్ చివరకు తిరిగి సంగారెడ్డి వద్దే ముగిసే విధంగా గతంలోనే ప్రాథమికంగా అలైన్మెంట్ చేశారు. గతంలో చేసిన అలైన్మెంట్లో చిన్నచిన్న మార్పులు తప్ప భారీ మార్పులు పెద్దగా ఉండబోవని జాతీయ రహదారుల సంస్థ అధికారులు సూచనా ప్రాయంగా పేర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా జాతీయ రహదారుల సంస్థ మరో నిర్ణయం తీసుకుంది.