బాహ్య వలయ రహదారిపై మే నెలాఖరు నాటికి రోజుకు 60వేల వాహనదారులు ఫాస్టాగ్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని హెచ్ఎండీఏ, హెచ్‌జీసీఎల్ ప్రకటించింది. 158 కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన ఔటర్‌రింగ్ రోడ్డుపై ప్రతి రోజు 1లక్షా 30 లక్షల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపింది. వాటిలో దాదాపు 60 వేల వాహనాలు ఫాస్టాగ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఈటీసీ) సదుపాయాన్ని కలిగివున్నాయని పేర్కొంది.
ఓఆర్ఆర్పై 2018 డిసెంబర్ 11వ తేదీ నుంచి ఫాస్టాగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రారంభంలో ఫాస్టాగ్నిబంధనలను 2019 మార్చి వరకు దాదాపు 10 వేల వాహనదారులు వినియోగించుకున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్‌జీసీఎల్) అధికారుల నిరంతర పర్యవేక్షణ ఫలితంగా 2020 మే నెల చివరి నాటికి సరాసరిగా రోజుకు 60 వేల మంది వాహనదారులు ఫాస్టాగ్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని అధికారులు చెప్పిన లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
50 శాతం డెడికేటెడ్ లైన్లు...