హైదరాబాద్ మాదాపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ- నిఫ్ట్ ప్రాంగణంలో స్పెక్ట్రం వేడుకలు అలరించాయి. విద్యార్థులు రూపొందించిన సరికొత్త డిజైన్ దుస్తులతో ప్రత్యేక ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా తీర్చిదిద్దిన డిజైన్లు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
నిఫ్ట్ విద్యార్థులు వ్యర్థాలతో అందాలను ఆవిష్కృతం చేసి శభాష్ అనిపించారు. సృజనాత్మకత ఆలోచనలకు వ్యర్థాలు వయ్యారంగా అడుగులేశాయి. చూడముచ్చటైన వస్త్రాలతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేసి అదరహో అనిపించారు.