తెలంగాణ

telangana

ETV Bharat / state

అమరావతిలో ఉద్రిక్తత... ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి - అమరావతిలో ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి

ఆంధ్రప్రదేశ్​లోని అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటం వల్ల రెచ్చిపోయిన నిరసనకారులు అక్కడే ఉన్న మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వసం అయ్యాయి.

farmers-throw-stones-on-mlas-car
అమరావతిలో ఉద్రిక్తత... ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి..

By

Published : Jan 7, 2020, 2:22 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల రహదారుల నిర్బంధం నేపథ్యంలో చినకాకాని వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. ఉదయం నుంచి రహదారిని నిర్బంధం చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్​ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు వాహనాలపై రాళ్లు రువ్వారు. దీనితో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారుపై రైతులు రాళ్లతో దాడి చేసి.. అద్దాలు ధ్వంసం చేశారు. రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

అమరావతిలో ఉద్రిక్తత... ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి..

ఇవీచూడండి:కార్పొరేషన్లు, పురపాలక సంస్థలలో ఎన్నికల వేడి

ABOUT THE AUTHOR

...view details