తెలంగాణ

telangana

ETV Bharat / state

'వ్యవసాయ చట్టాల ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుంది'

కేంద్ర వ్యవసాయ చట్టాల ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి - ఏఐకేఎస్​సీసీ పిలుపు మేరకు హైదరాబాద్‌ ఇందిరాపార్క్ వద్ద రైతుసంఘాల ఆధ్వర్యంలో రెండో రోజు జరిగిన సంఘీభావ ధర్నాలో ఆయన పాల్గొన్నారు.

'వ్యవసాయ చట్టాలపై ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుంది'
'వ్యవసాయ చట్టాలపై ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుంది'

By

Published : Dec 15, 2020, 4:17 PM IST

అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి పిలుపు మేరకు హైదరాబాద్‌ ఇందిరా పార్క్ వద్ద అఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. రెండోరోజు జరిగిన సంఘీభావ నిరవధిక ధర్నాను మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ప్రారంభించారు. "కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలి", "కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తిరస్కరిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలి", "విద్యుత్ ఉపసంహరణ బిల్లు ఉపసంహరించుకోవాలి", "రైతు పంటలన్నింటినీ ఎంఎస్‌పీతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలి" డిమాండ్లతో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

రైతుల పంటలన్నింటినీ కనీస మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. సాగు చట్టాల రద్దు, విద్యుత్ సవరణ బిల్లు నిరసిస్తూ చిన్నారులు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. వ్యవసాయ చట్టాలు రద్దు చేయకపోతే దేశవ్యాప్త ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని నాగేశ్వర్‌ హెచ్చరించారు.

'వ్యవసాయ చట్టాలపై ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుంది'

ఇదీ చూడండి:వాటర్ ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపిన ఫిజికల్ డైరక్టర్​లు

ABOUT THE AUTHOR

...view details