కొవిడ్ కారణంగా నష్టపోయిన వ్యవసాయ రంగం, రైతాగం, వ్యవసాయ కూలీలను కేంద్రం ఆదుకోవాలంటూ నేడు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నారు. అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ-ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో నిరసన జరగనుంది. హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. ప్రతి గ్రామంలో రైతులు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఏఐకేఎస్‌సీసీ పిలుపునిచ్చింది. క్విట్ ఇండియా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో దేశమంతా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ ఆర్డినెన్సులు ఉపసంహరించుకోవడం సహా.. రైతులు ప్రధానమైన 9 డిమాండ్లతో నిరసర చేపట్టనున్నారు. కార్పొరేట్లను వెళ్లగొడదాం.. వ్యవసాయం, రైతాంగాన్ని కాపాడుకుందాం అన్న నినాదంతో... దేశవ్యాప్తంగా 250 రైతు సంఘాలు ఆందోళనకు నడుం బిగించాయి.
నేడు దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు... - AIKSCC PROTEST ON 9TH august india
కరోనా నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన వ్యవసాయ రంగం, రైతాంగం, వ్యవసాయ కూలీలను కేంద్రం ఆదుకోవాలంటూ నేడు దేశవ్యాప్తంగా అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ- ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో రైతుల నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.
ఆదివారం దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన
తెలుగు రాష్ట్రాల్లో 30 రైతు సంఘాల ఆధ్వర్యంలో 5000 గ్రామాల్లో నిరసనలు చేపట్టనున్నాయి. 3 ఆర్డినెన్సులు, విద్యుత్ చట్టం కాపీలు తగలబెట్టడం, గ్రామ స్థాయిలో ఆర్డినెన్సులపై, కేంద్ర, రాష్ట్ర విధానాలపై చర్చ, అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు రైతులు చేయనున్నారు.
ఇదీ చూడండి :'పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు'
Last Updated : Aug 9, 2020, 4:30 AM IST