తెలంగాణ

telangana

ETV Bharat / state

యూరియా కొరతకు ప్రభుత్వమే కారణం: లక్ష్మణ్ - తెలంగాణలో యూరియా కొరతకు ప్రధాన కారణం తెరాస ప్రభుత్వం అసమర్థతేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు

తెలంగాణలో ఏర్పడిన యూరియా కొరతపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ స్పందించారు. యూరియాను అక్రమంగా నిల్వ చేసిన వ్యాపారులను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. యూరియా దొరక్క  రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

రైతులు ఇబ్బందులు పట్టించుకోని ప్రభుత్వం: లక్ష్మణ్‌

By

Published : Oct 10, 2019, 11:40 PM IST

రైతులు ఇబ్బందులు పట్టించుకోని ప్రభుత్వం: లక్ష్మణ్‌

తెలంగాణలో యూరియా కొరతకు ప్రభుత్వ విధానాలే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. యూరియా వ్యాపారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై యూరియాను నిలుపుదల చేసి కృత్రిమ కొరత సృష్టించారన్నారు. యూరియాను అక్రమంగా నిల్వ చేసిన వ్యాపారులను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియా కొరతకు గల కారణాలు అన్వేషించినా.. ఈ వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు గుర్తించకపోవడమే ఈ అనుమానాలకు కారణమని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details