Debt Relief Commission: ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పుతీసుకున్న 12 మంది రైతులు సకాలంలో అప్పులు చెల్లించకపోవడం వల్ల వడ్డీ వ్యాపారులు రైతుల ఫొటోలు బ్యాంకు నోటీసు బోర్డులపై అంటిస్తున్నారని వాపోయారు. అంతే కాకుండా తమ పేర్లను ఊళ్లో చాటింపులు వేయించడం, రైతుల ఇళ్లకు తాళాలు వేయడం వంటి చేయడం వల్ల అప్పులు చెల్లించలేని 12 మంది రైతులు ఇవాళ రైతు రుణ ఉపశమన కమిషన్‌ను ఆశ్రయించారు.
ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థుల నుంచి అప్పు తీసుకుని పంటలు పండక, అప్పు చెల్లించక వడ్డీలు పెరిగి అప్పు తీర్చలేని రైతులు కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ ఛైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, సభ్యులు కవ్వ లక్ష్మారెడ్డి, పాకాల శ్రీహరిరావు, కమిషన్ సెక్రటరీ ఎన్.శారదాదేవి నేతృత్వంలో విచారణ జరిపారు. రైతులు... గ్రామాలు విడిచిపోయే వారు కాదని కమిషన్ తెలిపింది. భూమిని నమ్ముకుని బతుకుతున్న వారిని చిన్న చిన్న అప్పుల వసూళ్ల కోసం రైతుల ఫొటోలు, బ్యాంకు నోటీసు బోర్డులపై పెట్టడం, చాటింపులు వేయించడం, ఇళ్లకు తాళాలు వేయడం లాంటి పనులు అమానవీయని పేర్కొంది. అలాంటివి చేయకూదని కమిషన్ హెచ్చరించింది.