వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసులు పీవీ జంయత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. పీవీ సేవలను స్మరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ, కాన్‌బెర్రా, అడిలైడ్, బ్రిస్బేన్ ప్రాంతాల్లో తెరాస ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పీవీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
డెన్మార్క్ యూరోప్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ శ్యామ్ బాబు ఆకుల, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్, తెరాస డెన్మార్క్, డెన్మార్క్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పీవీ శతజయంతి వేడుకలను జరిపారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు డెన్మార్క్‌లో పీవీ నరసింహారావు విగ్రహ ఆవిష్కరణకు కృషి చేస్తామని తెలిపారు.