సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి రైతే కేంద్ర బిందువని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో జరిగిన మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీఎన్జీఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ యూనియన్ - 2020 డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
సుమారు 60 లక్షల రైతు కుటుంబాల కోసం...
రైతు చెమట చుక్కలు, మాసిన బట్టలే సమాజానికి ఆదర్శమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతు ఎక్కడికి వెళ్లినా లేచి ఎదురెళ్లి సంతోషంగా ఆహ్వానించగలిగే పరిస్థితుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుమారు 60 లక్షల రైతు కుటుంబాల కోసం పంట, ఉత్పత్తి, మార్కెటింగ్, ప్రాసెసింగ్, సహకార వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తెచ్చామని వివరించారు. అసంఘటిత రైతులను సంఘటితం చేసుకుని రైతు సమన్వయ సమితుల ద్వారా క్రియాశీలకంగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించొచ్చని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో సిద్దిపేట, గజ్వేల్ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, రాష్ట్ర బేవరేజెస్ ఛైర్మన్ దేవీ ప్రసాదరావు, టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, టీఎన్జీఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు నర్సింహా రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాం నర్సింహ గౌడ్ తదితరులు హాజరయ్యారు.
టీఎన్జీఓ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ ఇవీ చూడండి : బంజారాహిల్స్‌లో నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సు