Farmer found a diamond: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతుకు అదృష్టం వరించింది. టమాటా పైరులో రైతు కుమార్తె కలుపు తీస్తుండగా వజ్రం దొరికొంది. వివరాల్లోకి వెళితే తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం పొలంలో కలుపు పనుల్లో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో రైతు కుమార్తెకు 10 క్యారెట్ల బరువైన వజ్రం లభించింది.
కలుపు తీస్తుంటే కలిసొచ్చింది.. రైతు చేతికి వజ్రం దొరికింది.. విలువెంతంటే..?
Farmer found a diamond: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతు 'పంట' పండింది. టమాటా పైరులో రైతు కుమార్తె కలుపు తీస్తుండగా 10 క్యారెట్ల వజ్రం దొరికొంది. వ్యాపారులు దాన్ని రూ.34 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
farmer-found-a-diamond-in-kurnool-district
విషయం తెలుసుకున్న పెరవళి, జొన్నగిరి ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు రైతును సంప్రదించారు. వ్యాపారులంతా కలిసి దాన్ని రూ.34 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఏటా తొలకరి వర్షాల తర్వాత జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి ప్రాంతాల్లోని పొలాల్లో వజ్రాలు లభించడం సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: