తెలంగాణ

telangana

ETV Bharat / state

'సాగు చట్టాలు వెనక్కి తీసుకునే వరకూ పోరాటం ఆగదు' - తెలంగాణ వార్తలు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నల్గొండ X రోడ్డు వద్ద రైతు, ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నాయకులు ఆందోళన చేపట్టారు. సాగు చట్టాలను రద్దు చేయాలని, అరెస్ట్‌ చేసిన రైతు నేతలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

nalgonda x road, farmer protests
నల్గొండ చౌరస్తా, సాగు చట్టాలపై నిరసనలు

By

Published : Feb 6, 2021, 12:04 PM IST

సాగు చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు మిన్నంటుతున్నాయి. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు హైదరాబాద్‌- నల్గొండ చౌరస్తాలో రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. 'తక్షణమే వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలి', 'అరెస్ట్ చేసిన రైతు నేతలను విడుదల చేయాలి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దిల్లీ సరిహద్దుల్లో పోరాటాన్ని అణచివేయాలని కేంద్రం చూస్తున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం మరింత బలపడుతుందని రైతు సంఘాల నేతలు తెలిపారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. శాసనసభలో సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఆందోళనలో రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్‌ మహ్మద్ అబ్దుల్ రహీం, రైతు ప్రతినిధి శంకర్, కార్యదర్శి, దళిత బహుజన ఫ్రంట్ రుధ్న సైమన్ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ చౌరస్తాలో రైతు, ప్రజా సంఘాల ధర్నా

ఇదీ చదవండి:మందకృష్ణ, బండారి మధ్య వాగ్వాదం

ABOUT THE AUTHOR

...view details