హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పరిధి శాంతినగర్‌లోని మత్స్య భవన్లో రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ సువర్ణకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ ఫిషరీస్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియామకం పట్ల హైదరాబాద్ జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘం ఛైర్ పర్సన్ కొప్పు పద్మ బెస్త శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుష్పగుచ్ఛం ఇచ్చి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌గా మత్స్యసహకార సంఘాల బలోపేతానికి సువర్ణ ఎంతో కృషి చేసినట్లు పద్మ గుర్తు చేసుకున్నారు.
భవిష్యత్‌లోనూ అండగా ఉంటారని...
మత్స్య సహకార సంఘాల సమస్యలను సావధానంగా విని.. వాటి పరిష్కారానికి కృషి చేశారని పద్మ కొనియాడారు. ప్రస్తుతం జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారిణిగా కేంద్ర ప్రభుత్వ పథకాలను మత్స్యకారులకు అందించడంలో కృషి చేస్తారని పద్మ ధీమా వ్యక్తం చేశారు. గత మూడున్నర సంవత్సరాలుగా తెలంగాణ మత్స్యశాఖ కమిషనర్‌గా మత్స్య సహకార సంఘాలకు, మత్స్య అభివృద్ధికి తోడ్పాటు అందించినందుకు ఎన్ఎఫ్డీబీ నూతన సీఈఓ సువర్ణకు ధన్యవాదాలు తెలియజేశారు. సొసైటీ సమస్యల పరిష్కారంలో నేషనల్ బోర్డు తరఫునా తమకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : కోదండరాం నిరసన దీక్ష.. ప్రజల బతుకులు కాపాడాలని డిమాండ్