మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది కరోనా బాధితుల పరిస్థితి. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ఏడో అంతస్తులో కరోనా పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం పైకప్పుకు ఉన్న ఫ్యాన్ ప్రమాదవశాత్తు రోగులపై పడింది. దీంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులపై పడిన ఫ్యాన్ - కొవిడ్ బాధితుల తాజా వార్తలు
తెలంగాణలో కరోనా కలవరపెడుతోంది. బాధితులకు చికిత్స కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. రోగులందరూ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కొవిడ్‌తో పోరాడుతూ.. బతుకుతామో లేదో అని ఆందోళనలో ఉన్నారు రోగులు. అయితే ఈ సమయంలో వారికి ఫ్యాన్ గండం ఎదురైంది.
చికిత్స పొందుతున్న కరోనా బాధితులపై పడిన ఫ్యాన్
విషయం తెలిసిన సిబ్బంది చాలా సేపటి వరకు రాలేదు. అసలే ప్రాణాలతో పోరాడుతున్నామని.. ఈ సమయంలో ఇలా జరిగితే బాధ్యులు ఎవరంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం'
TAGGED:
gandhi hospital latest news