Lata Mangeshkar is Associated with TTD : ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్‌కు తితిదేతో అనుబంధం ఉంది. అన్నమయ్య రచించిన 10 సంకీర్తనలను 2010లో ఆమె హిందూస్థానీ బాణీలో గానం చేశారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ఈ సంకీర్తనలు రికార్డు చేసి అన్నమయ్య స్వర లతార్చన పేరుతో సీడీని రూపొందించి భక్త లోకానికి అందించింది.
Lata Mangeshkar: తితిదేతో లతా మంగేష్కర్‌కు అనుబంధం - తితిదే వార్తలు
Lata Mangeshkar is Associated with TTD: ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్‌కు తితిదేతో అనుబంధం ఉంది. అన్నమయ్య రచించిన 10 సంకీర్తనలను 2010లో ఆమె హిందూస్థానీ బాణీలో గానం చేశారు. అంతే కాకుండా శ్రీవారి ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా కూడా సేవలందించారు. తితిదే ఎస్వీబీసీ ఛానల్‌ను ఆమె సంకీర్తనతోనే ప్రారంభించడం విశేషం.
‘గోవిందా గోవిందా శ్రీనివాసా గోవిందా, తిరుపతి వేంకటేశ్వర గోవిందా..’ అనే పల్లవితో సాగే సంకీర్తనలకు భక్తుల నుంచి విశేషాదరణ లభించింది. ఆమె శ్రీవారి ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా కూడా సేవలందించారు. తితిదే ఎస్వీబీసీ ఛానల్‌ను ఆమె సంకీర్తనతోనే ప్రారంభించడం విశేషం. లతా మంగేష్కర్ మృతిపట్ల తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. తితిదేకు ఆమె అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.
ఇదీ చదవండి:లతా మంగేష్కర్ అంత్యక్రియలు.. అభిమానుల కన్నీటి వీడ్కోలు