తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో వాతావరణం చల్లబడి... శ్వాసకోశ వ్యాధులు ముదిరేందుకు ఊతమిస్తోంది. ఆస్తమా, ఎలర్జీ వంటి సమస్యలు ఉన్నవారికి సమస్యలు ఎదురవుతున్నాయి. వీరికి కరోనా వస్తే పరిస్థితి తీవ్రమయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ప్రముఖ పల్మనాలజిస్ట్, శ్వాస ఆస్పత్రుల నిర్వాహకులు డాక్టర్ విష్ణున్ వీరపనేనితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
Doctor Vishnun: 'ఆ వ్యాధులు ఉన్నవాళ్లు శానిటైజర్లు ఎక్కువ వాడొద్దు..' - ఊపిరితిత్తులపై కొవిడ్ ప్రభావం
Doctor Vishnun Interview: అతిగా ఆవిరి పట్టడం ఊపిరితిత్తులకు అనర్ధమని.. రోజుకు రెండు సార్లు ఆవిరి పడితే చాలని.. ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ విష్ణున్ వీరపనేని తెలిపారు. కరోనా వచ్చిందని అనవసరమైన పరీక్షలు చేయించుకోవద్దని.. డాక్టర్ సూచిస్తేనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
డాక్టర్ విష్ణున్ వీరపనేని