తెలంగాణ

telangana

ETV Bharat / state

'చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నాం'

గురువారం సికింద్రాబాద్ పరిధిలోని జేబీఎస్ బస్టాండు వద్ద పాపను పాతిపెట్టేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులు నోరు విప్పారు. పాప చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నట్లు వివరించారు.

'చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నాం'

By

Published : Nov 1, 2019, 1:28 PM IST

Updated : Nov 1, 2019, 3:51 PM IST

సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ వద్ద మూడు నెలల పాపను పాతిపెట్టేందుకు యత్నించిన ఘటనపై కుటుంబ సభ్యులు స్పందించారు. పాప చనిపోయిందనుకునే పాపను పూడ్చి పెట్టాలనుకున్నట్లు చిన్నారి బాబాయి తెలిపాడు. కానీ గుంత తవ్వాక పాప కదలడంతో పూడ్చి పెట్టే ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు పేర్కొన్నాడు. మళ్లీ ఆస్పత్రికి తీసుకొద్దామని చూసేలోపే ఎవరో వచ్చి... విషయాన్ని తప్పుగా చెప్పి పత్రికల్లో, టీవీల్లో ప్రచురించారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజంగానే పాపని వదిలించుకునే వాళ్లమైతే... ఆసుపత్రికి తీసుకొచ్చి ఎందుకు చికిత్స చేయిస్తామని ప్రశ్నించారు. పూర్తిగా విషయం తెలియకుండా ఇలా దుష్ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

'చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నాం'

ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'

Last Updated : Nov 1, 2019, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details