సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. సిద్దిపేటకు చెందిన సత్తయ్య ఆనంద్‌బాగ్‌లో నివాసం ఉంటున్నాడు. హార్ట్ స్ట్రోక్ కారణంగా రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. గుండెపోటు వచ్చి సత్తయ్య చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతను చనిపోయినప్పుడు చేతికి ఉంగరం. జేబులో డబ్బులు ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అతని చేతికి ఉన్న ఉంగరాన్ని, డబ్బులను ఆసుపత్రి సిబ్బంది కాజేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఆసుపత్రి సిబ్బంది చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని దొంగిలించారని ఆందోళనకు దిగారు. అనంతరం ఆస్పత్రి సిబ్బందితో యాజమాన్యం మాట్లాడగా ఉంగరాన్ని తీసి పక్కకు ఉంచినట్లు తెలిపారు. తమకు ఎంతో కాలంగా సెంటిమెంట్‌గా ఆ ఉంగరం ఉందని... అందుకే అంత్యక్రియల సమయంలో రింగు లేదని గుర్తించి ఇక్కడికి వచ్చి ఆరా తీసినట్లు అతని కుమారుడు శ్రవణ్ కుమార్ తెలిపారు.
చికిత్స కోసం వెళ్తే ఉంగరం, డబ్బులు కాజేశారు...! - problems
చికిత్స కోసమని ఆస్పత్రికి వస్తే... ఆ దవాఖానా సిబ్బంది చనిపోయిన వ్యక్తి చేతి నుంచి ఉంగరం, జేబులో డబ్బులు కాజేసిన ఘటన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో చోటుచేసుకుంది.
చికిత్స కోసం వెళ్తే ఉంగరం, డబ్బులు కాజేశారు...!
ఇవీ చూడండి: పుట్టినరోజు నాడే ఆమెను మృత్యువు వెంటాడింది..