హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. నగరంలో ఒకే కుటుంబంలో ఎనిమిది మందికి పాకింది. టప్పాచబుత్రకు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి ఇటీవల కొవిడ్ సోకినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైందని సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై శ్రీకాంత్ గౌడ్లు వెల్లడించారు.
ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్ - family members got effected to corona in tappachabutra
హైదరాబాద్ నగరం టప్పాచబుత్రకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. అతని కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేశారు. ఆ వ్యక్తి తండ్రి, తల్లి, భార్య, నాలుగేళ్ల కొడుకు, సోదరుడు, సోదరి, ఇద్దరు చెల్లెళ్లకు వైరస్ పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
![ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్ family members got effected to corona in tappachabutra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7284288-thumbnail-3x2-fam-cor.jpg)
ఒకే కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్
ఆ వ్యక్తి సంబంధించిన కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం వారి నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు. పరీక్షల్లో అతని తండ్రి, తల్లి, భార్య, నాలుగేళ్ల కొడుకు, సోదరుడు, సోదరి, ఇద్దరు చెల్లెళ్లకు వైరస్ పాజిటివ్ నమోదైంది. బాధితులందరినీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు