ఆపదలో ఉన్న మహిళల భద్రతకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. హైదరాబాద్ అల్వాల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన... దేశంలోనే ఎక్కడా లేని విధంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కుటుంబ కలహాలు, గృహహింస, సమాజంలో వేధింపులకు గురైన మహిళలను ఆదుకోవడానికి అవసరమైన పోలీస్, న్యాయ విచారణ, కౌన్సిలింగ్ ఇలా అన్నీ సేవలు ఈ కేంద్రాల్లో లభిస్తాయని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కేసులు పెట్టడం ఒక ఎత్తైతే... వారికి శిక్షలు పడేలా చేయడం మరో ఎత్తని పేర్కొన్నారు. త్వరలోనే జీడిమెట్ల, ఇతర ప్రాంతాల్లో వీటిని ప్రారంభిస్తామని తెలిపారు.
'మహిళల భద్రతకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాల భరోసా'
మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యమిచ్చేలా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సైబారాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్ అల్వాల్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించిన ఆయన... దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇలాంటి కేంద్రాలను నెలకొల్పినట్లు తెలిపారు.
మహిళల భద్రత